సహాయ పూర్తి సమాచారం : బ్లాగు | సహాయ వెబ్ సైటు | ఆర్కుట్ |

వృద్దాశ్రమ సందర్శన వివరములు

సహాయ ఫౌండేషన్ ఏప్రిల్ మొదటి ఆదివారం నాడు వృద్దాశ్రమమును సందర్శించ వలెనని నిర్ణయించిన విషయంతెలిసినదే. నిన్నటి సందర్శన లో భాగముగా బీరంగూడ వద్ద నున్న శ్రీ సాయినాధ అనాధ సదనమును సందర్శించిఅక్కడ కొత్తగా వచ్చిన ముగ్గురు బామ్మలా ను పరిచయం చేసుకుని ... ముగ్గురు బామ్మలు నెల మీదపడుకుంటున్నారు అని తెలిసి వారి మంచాలు తాయారు చేయించడం కోసం కొలతలు తీసుకోవడం జరిగింది. మరోరెండు రోజుల్లో నాలుగు మంచాలు
వారికి అందచేయబడతాయి.

అక్కడ వారికి ఆల్రెడీ అంద చేసిన కూలర్ ను వాడుక లోకి తెచ్చి దానిని ఉపయోగించే విధానం వారికీ అర్ధం అయ్యేలాచెప్పి వారికీ కొన్ని ఫ్రూట్స్ ఇచ్చి రావడం జరిగింది.

అక్కడి నుండి తార్నాక సమీపం లోని మీన్స్ గోల్దేజ్ హోం ను సందర్శించి అక్కడ ఉన్నా ఇరవై మంది మానసికవికలాంగులకు వృద్దులకు పళ్ళు ఇచ్చి వారి తో కాసేపు గడిపి ... హోం ను గురించిన పూర్తి వివరాలునిర్వాహకులను అడిగి తెలుస్కోవడం జరిగినది.


అక్కడి నుండి హృదయస్పందన కార్యక్రమం లో పాలు పంచుకున్న డ్రమ్స్ ఆర్టిస్ట్ కిషోర్ కు నూతన కంప్యుటర్అందచేయ్యడం జరిగింది. అంధుడైన కిషోర్ ఏమిటి కంప్యుటర్ ఏమిటి అనుకుంటున్నారా .. జాస్ అనే సాఫ్ట్ వేర్ఉపయోగించి వారు చాల చక్కగా కంప్యూటర్ వినియోగించగలరు.

ఫోటోలు

http://picasaweb.google.com/sahaayafoundation412/050409_sainathaMeansOldagehomes#

2 వాఖ్యలు:

At April 6, 2009 at 8:00 PM జీడిపప్పు said...

హేట్సాఫ్!

 
At April 7, 2009 at 2:18 AM చైతన్య said...

హ్హ... చాలా బాగా జరిగింది ఈవెంట్. బామ్మలతో తాతయ్యలతో సరదాగా గడిపేసాము. It was really very nice!

సాయి నాథ ఆశ్రమంలో కొత్తగా వచ్చిన ముగ్గురు బామ్మలకి త్వరలోనే మంచాలు అందుతాయి.

MEANS లో కుడా maintanance బాగుంది. వాళ్ళు సేవ చేసేది డబ్బులు తీసుకునే అయినా కుడా వాళ్ళు చేసే పని ఎంతో అభినందనీయం. స్వయముగా ఒక్క పని కూడా చేసుకోలేని వృద్ధులకి అన్ని రకాలుగా సేవ చేయటం అనేది చిన్న విషయం కాదు!

మీలో ఎవరైనా మీకు తెలిసిన వృద్ధులను ఏదైనా ఆశ్రమంలో చేర్పించాలంటే MEANS లో చేర్పించొచ్చు. నెలకి ఒక బామ్మ/ తాతయ్య కి అయ్యే 6,000 ఖర్చు మీరు pay చేయవలసి ఉంటుంది.
MEANS వివరాలు:
www.meansindia.org
means2007@yahoo.com
9391039990

 

Post a Comment