సహాయ పూర్తి సమాచారం : బ్లాగు | సహాయ వెబ్ సైటు | ఆర్కుట్ |

Showing posts with label DESIRE. Show all posts
Showing posts with label DESIRE. Show all posts

ఈ నెలలో(May) సహాయ ఫౌండేషన్ ఈవెంట్ DESIRE సొసైటీ వాళ్ళు నిర్వహించిన సమ్మర్ క్యాంపులో జరిగింది.

DESIRE సొసైటీ వాళ్ళు HIV పిల్లల కోసం ఒక సమ్మర్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపు నిజాంపేట్ రోడ్ లోని విజ్ఞాన్ స్కూల్ లో మూడు రోజుల(8th, 9th, 10th May) పాటు కొనసాగింది. దాదాపు 50 మంది వరకు పిల్లలు వచ్చారు. అందులో దాదాపు 40 మంది DESIRE సొసైటీ లో ఉండే పిల్లలే!
మూడు రోజుల పాటు పిల్లలకి రకరాకాల ఆటలు ఆడిస్తూ... డాన్సులు వేయిస్తూ... ఏవో పోటీలు పెడుతూ... పిల్లలని బాగా ఉత్సాహపరిచారు. సాయంత్రం వరకు వివిధ రకాల ఇండోర్ గేమ్స్ నిర్వహించి... సాయంత్రం కో కో లాంటి outdoor గేమ్స్ ఆడించారు పిల్లలతో.
క్యాంపు ప్రారంభించిన రోజు సంగీత దర్శకులు RP పట్నాయక్ గారు వచ్చారు. దాదాపు మూడు గంటల పాటు పిల్లలతో సరదాగా గడిపారు. ఈమొత్తం ఈవెంట్ ని మహా న్యూస్ ఛానల్ వాళ్ళు కవర్ చేసారు.

పిల్లలంతా చాలా ఆక్టివ్ గా, ఆరోగ్యంగా ఉన్నారు. DESIRE సొసైటీ అసలు కేంద్రం IDA బొల్లారంలో ఉంది. అక్కడ దాదాపుగా 45 పిల్లలు ఉన్నారు. కొంతమంది కేర్ టేకర్స్, ఒక nutritionist ఎప్పుడు అక్కడే ఉంటారు. పిల్లలంతా దగ్గరలో ఉన్న govt స్కూల్ కి వెళ్తున్నారు.

సమ్మర్ క్యాంపులోని కొన్ని ఫోటోలు ఇక్కడ చూడండి.


DESIRE సొసైటీ వెబ్సైటు:
http://www.desiresociety.org/

కాంటాక్ట్ అడ్రస్:
జి రవిబాబు - founder
DESIRE సొసైటీ
LIG - 156, రోడ్ నెంబర్ 2,
KPHB కాలనీ,
హైదరాబాద్ - 500072
ఫోన్: 040 - 64581108 / 9849108082
ఈమెయిలు: desiresociety@yahoo.com