సహాయ పూర్తి సమాచారం : బ్లాగు | సహాయ వెబ్ సైటు | ఆర్కుట్ |

హృదయ స్పందన

సహాయ ఫౌండేషన్ చరిత్ర లో ఒక మైలు రాయి సహాయ సేవ ప్రస్తానం లో ఒక అద్భుత ఘట్టం గా హృదయ స్పందన గురించి చెప్పుకోవచ్చు.

కొందరు అంధ విద్యార్ధుల చే ఏర్పడిన ఆలాపన అనే సంస్థ తో సహాయ పరిచయం వారి తో ఒక గొప్ప సంగీత నాట్య విభావరి కి శ్రీకారం చుట్టింది.

వారి ప్రతిభను ప్రపంచానికి తెలియ చెయ్యాలనే తలంపు తో వారి తో సహాయ ఫౌండేషన్ చేసిన హృదయ స్పందన యెంత గొప్ప గా జరిగిందో మాటల్లో చెప్పలేను . పూర్తి అందులతో ఏర్పడిన ఆలాపన టీం తమ ప్రతిభతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసారు.

శుక్లాం భరధరం అంటు విజయ్ ప్రార్ధన తో మొదలైన కార్యక్రమం ..జగదానంద కారక అంటున్న శ్రావ్య విజయ్ త్యాగ రాజ కీర్తన తోను .. శ్రావ్య ఆలపించిన సినిమా గీతాల తోను ప్రేక్షకులను ఉర్రోతలూగించి .. విజయ్ మరియు ఆదిత్య దేశ భక్తి గీతాల నడుమ ఫణి విజయ శ్రీ నాట్యం తోను అందరి హృదయాలు దోచుకున్నారు.

ముఖ్యం గా చెప్పుకోవలసినది ఆర్కెస్ట్రా గురించి కిషోర్ డ్రమ్స్ తోను రాజేష్ రిథం పాడ్ తోను ఆదిత్య కీ బోర్డ్ తోను అద్భుతాలు చేసారు

అతిధులు గా విచ్చేసిన సిని ప్రముఖులు మురళి మోహన్ గారు బ్లేడ్ బాబ్జి డైరెక్టర్ దేవి ప్రసాద్ గారు, కమల్ కామ రాజు గారు , కృష్ణుడు గారు, విజయానంద్ గారు మరియుశ్రీకృష్ణ గారు తమ ప్రసంగాలలో ఆలాపన టీం భవిష్యత్తు బాగుండాలి అని ఆశీర్వదించారు

సహాయ ఫౌండేషన్ ఆద్వర్యమ్ లో జరిగిన హృదయ స్పందన విజయ వంతం అవడం ఆనంద దాయకం ఆ చిన్నారుల భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండాలని కోరుకుంటూ ....

సహాయా

http://picasaweb.google.co.uk/sahaayafoundation412/HrudayaSpandanaGr8AchievementOfSahaaya

1 వాఖ్యలు:

At March 30, 2009 at 11:20 PM చైతన్య said...

check my post on this event:
http://chaituhere.blogspot.com/2008/12/hrudaya-spandana-by-sahaaya-foundation.html

 

Post a Comment