సహాయ ఫౌండేషన్
bank account details
Name : SAHAAYA FOUNDATION
Acc. No : 293010100134613
AXIS BANK , ONGOLE BRANCH
< <సహాయ పూర్తి సమాచారం : బ్లాగు | సహాయ వెబ్ సైటు | ఆర్కుట్ |
రాష్ట్ర వ్యాప్తం గా అంధ విద్యార్ధుల పాఠాలు కేసెట్ల లో రికార్డ్ చేసి ఇవ్వడానికి సహాయ ఫౌండేషన్ పూనుకోవడం జరిగింది ...రేకార్డుచేసే ఓపిక ఉన్నవారు తమ అంగీకారాన్ని రెప్లై రూపం లో తెలియచేస్తే వారికి త్వరలో పుస్తకాలు కాసెట్లు అందచేయబడును
గత ఆదివారం సహాయ ఫౌండేషన్ ప్రతినిధులు డిసైర్ సొసైటి ని సందర్శించడం జరిగింది. అక్కడ 40 మంది బాల బాలికలు ఉన్నారు. వారంతా HIV/AIDS బాదిత అనాధ లు. వారు అక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడెలా ఉన్నారు అనే తేడా ను డిసైర్ వారు ఫోటోలు చూపించారు . పిల్లలంతా చాల ఉత్సాహముగా ఉన్నారు. మాతో కలిసి ఆడారు పాడారు డాన్స్ చేసారు. మేము కూడా వారికీ సైడ్ డాన్సర్లు గా మారి వారికి సహాయం చేసాం.
తరువాత సొసైటీ వారిని అడిగి మరిన్ని వివరాలు సేకరించడం జరిగింది. ప్రతి నెల వారికి మందులకు , భోజనాలు అవ్తున్న ఖర్చు ని అడిగి తెలుసుకోవడం జరిగింది. డిసైర్ వారు పిల్లలని చూసుకుంటున్న తీరు ప్రశంసనీయం. డిసైర్ వారి అవసరాలు తీర్చడం లో సహాయ తన వంతు సాయం అందించాలని తీర్మానించడం జరిగినది. డిసైర్ వారి కనీస అవసరాలు కింద ఇవ్వడం జరిగినది. ( వివరాలు తెలుగు లో రాసిన తప్పులు దొర్లే ప్రమాదం ఉన్నందున ఇంగ్లీషు లో ఇవ్వడం జరిగినది)
Item----------Manufacturers----------Qty Required (Units)----------COST
Tablets
Ciplin DS------------ Cipla-----------------------300 --------------------300
Bactrim DS----------Cipla--------------------- 1000--------------------1000
Zincivit----------------------------------------- 200---------------------500
ఈ నెలలో(May) సహాయ ఫౌండేషన్ ఈవెంట్ DESIRE సొసైటీ వాళ్ళు నిర్వహించిన సమ్మర్ క్యాంపులో జరిగింది.
DESIRE సొసైటీ వాళ్ళు HIV పిల్లల కోసం ఒక సమ్మర్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపు నిజాంపేట్ రోడ్ లోని విజ్ఞాన్ స్కూల్ లో మూడు రోజుల(8th, 9th, 10th May) పాటు కొనసాగింది. దాదాపు 50 మంది వరకు పిల్లలు వచ్చారు. అందులో దాదాపు 40 మంది DESIRE సొసైటీ లో ఉండే పిల్లలే!
మూడు రోజుల పాటు పిల్లలకి రకరాకాల ఆటలు ఆడిస్తూ... డాన్సులు వేయిస్తూ... ఏవో పోటీలు పెడుతూ... పిల్లలని బాగా ఉత్సాహపరిచారు. సాయంత్రం వరకు వివిధ రకాల ఇండోర్ గేమ్స్ నిర్వహించి... సాయంత్రం కో కో లాంటి outdoor గేమ్స్ ఆడించారు పిల్లలతో.
క్యాంపు ప్రారంభించిన రోజు సంగీత దర్శకులు RP పట్నాయక్ గారు వచ్చారు. దాదాపు మూడు గంటల పాటు పిల్లలతో సరదాగా గడిపారు. ఈమొత్తం ఈవెంట్ ని మహా న్యూస్ ఛానల్ వాళ్ళు కవర్ చేసారు.
పిల్లలంతా చాలా ఆక్టివ్ గా, ఆరోగ్యంగా ఉన్నారు. DESIRE సొసైటీ అసలు కేంద్రం IDA బొల్లారంలో ఉంది. అక్కడ దాదాపుగా 45 పిల్లలు ఉన్నారు. కొంతమంది కేర్ టేకర్స్, ఒక nutritionist ఎప్పుడు అక్కడే ఉంటారు. పిల్లలంతా దగ్గరలో ఉన్న govt స్కూల్ కి వెళ్తున్నారు.
సమ్మర్ క్యాంపులోని కొన్ని ఫోటోలు ఇక్కడ చూడండి.
DESIRE సొసైటీ వెబ్సైటు:
http://www.desiresociety.org/
కాంటాక్ట్ అడ్రస్:
జి రవిబాబు - founder
DESIRE సొసైటీ
LIG - 156, రోడ్ నెంబర్ 2,
KPHB కాలనీ,
హైదరాబాద్ - 500072
ఫోన్: 040 - 64581108 / 9849108082
ఈమెయిలు: desiresociety@yahoo.com
Labels: DESIRE, HIV, monthly events, Sahaaya, summer camp
సహాయ ఫౌండేషన్ ఏప్రిల్ మొదటి ఆదివారం నాడు వృద్దాశ్రమమును సందర్శించ వలెనని నిర్ణయించిన విషయంతెలిసినదే. నిన్నటి సందర్శన లో భాగముగా బీరంగూడ వద్ద నున్న శ్రీ సాయినాధ అనాధ సదనమును సందర్శించిఅక్కడ కొత్తగా వచ్చిన ముగ్గురు బామ్మలా ను పరిచయం చేసుకుని ... ఆ ముగ్గురు బామ్మలు నెల మీదపడుకుంటున్నారు అని తెలిసి వారి మంచాలు తాయారు చేయించడం కోసం కొలతలు తీసుకోవడం జరిగింది. మరోరెండు రోజుల్లో నాలుగు మంచాలు
వారికి అందచేయబడతాయి.
అక్కడ వారికి ఆల్రెడీ అంద చేసిన కూలర్ ను వాడుక లోకి తెచ్చి దానిని ఉపయోగించే విధానం వారికీ అర్ధం అయ్యేలాచెప్పి వారికీ కొన్ని ఫ్రూట్స్ ఇచ్చి రావడం జరిగింది.
అక్కడి నుండి తార్నాక సమీపం లోని మీన్స్ గోల్దేజ్ హోం ను సందర్శించి అక్కడ ఉన్నా ఇరవై మంది మానసికవికలాంగులకు వృద్దులకు పళ్ళు ఇచ్చి వారి తో కాసేపు గడిపి ... ఆ హోం ను గురించిన పూర్తి వివరాలునిర్వాహకులను అడిగి తెలుస్కోవడం జరిగినది.
అక్కడి నుండి హృదయస్పందన కార్యక్రమం లో పాలు పంచుకున్న డ్రమ్స్ ఆర్టిస్ట్ కిషోర్ కు నూతన కంప్యుటర్అందచేయ్యడం జరిగింది. అంధుడైన కిషోర్ ఏమిటి కంప్యుటర్ ఏమిటి అనుకుంటున్నారా .. జాస్ అనే సాఫ్ట్ వేర్ఉపయోగించి వారు చాల చక్కగా కంప్యూటర్ వినియోగించగలరు.
ఫోటోలు
http://picasaweb.google.com/sahaayafound
సహాయ ఫౌండేషన్ ఏప్రిల్ మొదటి ఆదివారం శ్రీ సాయి అనాధ శరణాలయం ను సందర్శించ వలెనని నిర్ణయించడం జరిగినది . అక్కడ వారికి కావలసిన వసతులు సమకూర్చడం తో బాటు సహాయ భవిష్యత్ కార్యాచరణము .. మరియుకొత్తగా చేరాలనుకునే వారి కోసం మీటింగ్ కూడా ఉంటుంది కావున సహాయ ఆహ్వానం మన్నించి సభ్యులు గాచేరాలనుకునే వారు రావచ్చు .
తేది : 5 ఏప్రిల్ ఆది వారం
సమయం : ఉదయం పదకొండు గంటలు
ప్రదేశం : శ్రీ సాయి అనాధ సదన్ , బి.హెచ్ .ఈ. ఎల్. వద్ద లింగం పల్లి , హైదరాబాద్.
కాంటాక్ట్ నంబర్ : 9963884600
సహాయ ఫౌండేషన్ కొందరు అంధ విద్యార్ధుల విద్య కొరకు వారి పాఠాలను .. కాసెట్స్ లోకి రికార్డు చేసి ఇచ్చే కార్యక్రమం ప్రతి సంవత్సరం చేపడుతున్న సంగతి అందరికి తెల్సిందే .
ఈ సంవత్సరం కొందరు ఏం. ఏ . తెలుగు విద్యార్ధుల కోసం మనసులో మాట బ్లాగు ఓనరు సుజాత గారు చాల తక్కువ వ్యవధి లో . ఒక పూర్తి పుస్తకాన్ని స్వయం గా రికార్దు చేసి ఇచ్చారు .. .. వారికీ మనస్పూర్తిగా ధన్య వాదాలు తెలియచేసుకుంటూ... వారిలో ఉన్నా శ్రద్ధ , ఆసక్తి ... సాయం చెయ్యాలనే తపనకి శిరసు వంచి నమస్కరిస్తూ వారి సహాయ సహకారాలు .. ఎప్పుడు అందించాలని కోరుకుంటున్నాను .
ఈ వేసవి లో ఓల్డ్ ఏజ్ హోం లలో ఉండే తాతయ్యలు బామ్మలకు వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఈ వేసవి ని హాయిగా ఆస్వాదించడానికి కొన్ని వృద్దాశ్రమాలు సందర్శించి .. ఎయిర్ కూలర్స్ వారికీ అందచేయ్యలనేది సహాయ ఫౌండేషన్ ఉద్దేశం .. దీని మీద మీ సలహాలు ,సూచనలు పంపగలరు.
bank account details
Name : SAHAAYA FOUNDATION
Acc. No : 293010100134613
AXIS BANK , ONGOLE BRANCH
< <నవీకరించినది శ్రీనివాస్