సహాయ ఫౌండేషన్
bank account details
Name : SAHAAYA FOUNDATION
Acc. No : 293010100134613
AXIS BANK , ONGOLE BRANCH
< <సహాయ పూర్తి సమాచారం : బ్లాగు | సహాయ వెబ్ సైటు | ఆర్కుట్ |
రాష్ట్ర వ్యాప్తం గా అంధ విద్యార్ధుల పాఠాలు కేసెట్ల లో రికార్డ్ చేసి ఇవ్వడానికి సహాయ ఫౌండేషన్ పూనుకోవడం జరిగింది ...రేకార్డుచేసే ఓపిక ఉన్నవారు తమ అంగీకారాన్ని రెప్లై రూపం లో తెలియచేస్తే వారికి త్వరలో పుస్తకాలు కాసెట్లు అందచేయబడును
గత ఆదివారం సహాయ ఫౌండేషన్ ప్రతినిధులు డిసైర్ సొసైటి ని సందర్శించడం జరిగింది. అక్కడ 40 మంది బాల బాలికలు ఉన్నారు. వారంతా HIV/AIDS బాదిత అనాధ లు. వారు అక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడెలా ఉన్నారు అనే తేడా ను డిసైర్ వారు ఫోటోలు చూపించారు . పిల్లలంతా చాల ఉత్సాహముగా ఉన్నారు. మాతో కలిసి ఆడారు పాడారు డాన్స్ చేసారు. మేము కూడా వారికీ సైడ్ డాన్సర్లు గా మారి వారికి సహాయం చేసాం.
తరువాత సొసైటీ వారిని అడిగి మరిన్ని వివరాలు సేకరించడం జరిగింది. ప్రతి నెల వారికి మందులకు , భోజనాలు అవ్తున్న ఖర్చు ని అడిగి తెలుసుకోవడం జరిగింది. డిసైర్ వారు పిల్లలని చూసుకుంటున్న తీరు ప్రశంసనీయం. డిసైర్ వారి అవసరాలు తీర్చడం లో సహాయ తన వంతు సాయం అందించాలని తీర్మానించడం జరిగినది. డిసైర్ వారి కనీస అవసరాలు కింద ఇవ్వడం జరిగినది. ( వివరాలు తెలుగు లో రాసిన తప్పులు దొర్లే ప్రమాదం ఉన్నందున ఇంగ్లీషు లో ఇవ్వడం జరిగినది)
Item----------Manufacturers----------Qty Required (Units)----------COST
Tablets
Ciplin DS------------ Cipla-----------------------300 --------------------300
Bactrim DS----------Cipla--------------------- 1000--------------------1000
Zincivit----------------------------------------- 200---------------------500
ఈ నెలలో(May) సహాయ ఫౌండేషన్ ఈవెంట్ DESIRE సొసైటీ వాళ్ళు నిర్వహించిన సమ్మర్ క్యాంపులో జరిగింది.
DESIRE సొసైటీ వాళ్ళు HIV పిల్లల కోసం ఒక సమ్మర్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపు నిజాంపేట్ రోడ్ లోని విజ్ఞాన్ స్కూల్ లో మూడు రోజుల(8th, 9th, 10th May) పాటు కొనసాగింది. దాదాపు 50 మంది వరకు పిల్లలు వచ్చారు. అందులో దాదాపు 40 మంది DESIRE సొసైటీ లో ఉండే పిల్లలే!
మూడు రోజుల పాటు పిల్లలకి రకరాకాల ఆటలు ఆడిస్తూ... డాన్సులు వేయిస్తూ... ఏవో పోటీలు పెడుతూ... పిల్లలని బాగా ఉత్సాహపరిచారు. సాయంత్రం వరకు వివిధ రకాల ఇండోర్ గేమ్స్ నిర్వహించి... సాయంత్రం కో కో లాంటి outdoor గేమ్స్ ఆడించారు పిల్లలతో.
క్యాంపు ప్రారంభించిన రోజు సంగీత దర్శకులు RP పట్నాయక్ గారు వచ్చారు. దాదాపు మూడు గంటల పాటు పిల్లలతో సరదాగా గడిపారు. ఈమొత్తం ఈవెంట్ ని మహా న్యూస్ ఛానల్ వాళ్ళు కవర్ చేసారు.
పిల్లలంతా చాలా ఆక్టివ్ గా, ఆరోగ్యంగా ఉన్నారు. DESIRE సొసైటీ అసలు కేంద్రం IDA బొల్లారంలో ఉంది. అక్కడ దాదాపుగా 45 పిల్లలు ఉన్నారు. కొంతమంది కేర్ టేకర్స్, ఒక nutritionist ఎప్పుడు అక్కడే ఉంటారు. పిల్లలంతా దగ్గరలో ఉన్న govt స్కూల్ కి వెళ్తున్నారు.
సమ్మర్ క్యాంపులోని కొన్ని ఫోటోలు ఇక్కడ చూడండి.
DESIRE సొసైటీ వెబ్సైటు:
http://www.desiresociety.org/
కాంటాక్ట్ అడ్రస్:
జి రవిబాబు - founder
DESIRE సొసైటీ
LIG - 156, రోడ్ నెంబర్ 2,
KPHB కాలనీ,
హైదరాబాద్ - 500072
ఫోన్: 040 - 64581108 / 9849108082
ఈమెయిలు: desiresociety@yahoo.com
Labels: DESIRE, HIV, monthly events, Sahaaya, summer camp
సహాయ ఫౌండేషన్ ఏప్రిల్ మొదటి ఆదివారం నాడు వృద్దాశ్రమమును సందర్శించ వలెనని నిర్ణయించిన విషయంతెలిసినదే. నిన్నటి సందర్శన లో భాగముగా బీరంగూడ వద్ద నున్న శ్రీ సాయినాధ అనాధ సదనమును సందర్శించిఅక్కడ కొత్తగా వచ్చిన ముగ్గురు బామ్మలా ను పరిచయం చేసుకుని ... ఆ ముగ్గురు బామ్మలు నెల మీదపడుకుంటున్నారు అని తెలిసి వారి మంచాలు తాయారు చేయించడం కోసం కొలతలు తీసుకోవడం జరిగింది. మరోరెండు రోజుల్లో నాలుగు మంచాలు
వారికి అందచేయబడతాయి.
అక్కడ వారికి ఆల్రెడీ అంద చేసిన కూలర్ ను వాడుక లోకి తెచ్చి దానిని ఉపయోగించే విధానం వారికీ అర్ధం అయ్యేలాచెప్పి వారికీ కొన్ని ఫ్రూట్స్ ఇచ్చి రావడం జరిగింది.
అక్కడి నుండి తార్నాక సమీపం లోని మీన్స్ గోల్దేజ్ హోం ను సందర్శించి అక్కడ ఉన్నా ఇరవై మంది మానసికవికలాంగులకు వృద్దులకు పళ్ళు ఇచ్చి వారి తో కాసేపు గడిపి ... ఆ హోం ను గురించిన పూర్తి వివరాలునిర్వాహకులను అడిగి తెలుస్కోవడం జరిగినది.
అక్కడి నుండి హృదయస్పందన కార్యక్రమం లో పాలు పంచుకున్న డ్రమ్స్ ఆర్టిస్ట్ కిషోర్ కు నూతన కంప్యుటర్అందచేయ్యడం జరిగింది. అంధుడైన కిషోర్ ఏమిటి కంప్యుటర్ ఏమిటి అనుకుంటున్నారా .. జాస్ అనే సాఫ్ట్ వేర్ఉపయోగించి వారు చాల చక్కగా కంప్యూటర్ వినియోగించగలరు.
ఫోటోలు
http://picasaweb.google.com/sahaayafound
సహాయ ఫౌండేషన్ ఏప్రిల్ మొదటి ఆదివారం శ్రీ సాయి అనాధ శరణాలయం ను సందర్శించ వలెనని నిర్ణయించడం జరిగినది . అక్కడ వారికి కావలసిన వసతులు సమకూర్చడం తో బాటు సహాయ భవిష్యత్ కార్యాచరణము .. మరియుకొత్తగా చేరాలనుకునే వారి కోసం మీటింగ్ కూడా ఉంటుంది కావున సహాయ ఆహ్వానం మన్నించి సభ్యులు గాచేరాలనుకునే వారు రావచ్చు .
తేది : 5 ఏప్రిల్ ఆది వారం
సమయం : ఉదయం పదకొండు గంటలు
ప్రదేశం : శ్రీ సాయి అనాధ సదన్ , బి.హెచ్ .ఈ. ఎల్. వద్ద లింగం పల్లి , హైదరాబాద్.
కాంటాక్ట్ నంబర్ : 9963884600
సహాయ ఫౌండేషన్ కొందరు అంధ విద్యార్ధుల విద్య కొరకు వారి పాఠాలను .. కాసెట్స్ లోకి రికార్డు చేసి ఇచ్చే కార్యక్రమం ప్రతి సంవత్సరం చేపడుతున్న సంగతి అందరికి తెల్సిందే .
ఈ సంవత్సరం కొందరు ఏం. ఏ . తెలుగు విద్యార్ధుల కోసం మనసులో మాట బ్లాగు ఓనరు సుజాత గారు చాల తక్కువ వ్యవధి లో . ఒక పూర్తి పుస్తకాన్ని స్వయం గా రికార్దు చేసి ఇచ్చారు .. .. వారికీ మనస్పూర్తిగా ధన్య వాదాలు తెలియచేసుకుంటూ... వారిలో ఉన్నా శ్రద్ధ , ఆసక్తి ... సాయం చెయ్యాలనే తపనకి శిరసు వంచి నమస్కరిస్తూ వారి సహాయ సహకారాలు .. ఎప్పుడు అందించాలని కోరుకుంటున్నాను .
ఈ వేసవి లో ఓల్డ్ ఏజ్ హోం లలో ఉండే తాతయ్యలు బామ్మలకు వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఈ వేసవి ని హాయిగా ఆస్వాదించడానికి కొన్ని వృద్దాశ్రమాలు సందర్శించి .. ఎయిర్ కూలర్స్ వారికీ అందచేయ్యలనేది సహాయ ఫౌండేషన్ ఉద్దేశం .. దీని మీద మీ సలహాలు ,సూచనలు పంపగలరు.
సహాయ ఫౌండేషన్ చరిత్ర లో ఒక మైలు రాయి సహాయ సేవ ప్రస్తానం లో ఒక అద్భుత ఘట్టం గా హృదయ స్పందన గురించి చెప్పుకోవచ్చు.
కొందరు అంధ విద్యార్ధుల చే ఏర్పడిన ఆలాపన అనే సంస్థ తో సహాయ పరిచయం వారి తో ఒక గొప్ప సంగీత నాట్య విభావరి కి శ్రీకారం చుట్టింది.
వారి ప్రతిభను ప్రపంచానికి తెలియ చెయ్యాలనే తలంపు తో వారి తో సహాయ ఫౌండేషన్ చేసిన హృదయ స్పందన యెంత గొప్ప గా జరిగిందో మాటల్లో చెప్పలేను . పూర్తి అందులతో ఏర్పడిన ఆలాపన టీం తమ ప్రతిభతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసారు.
శుక్లాం భరధరం అంటు విజయ్ ప్రార్ధన తో మొదలైన కార్యక్రమం ..జగదానంద కారక అంటున్న శ్రావ్య విజయ్ త్యాగ రాజ కీర్తన తోను .. శ్రావ్య ఆలపించిన సినిమా గీతాల తోను ప్రేక్షకులను ఉర్రోతలూగించి .. విజయ్ మరియు ఆదిత్య దేశ భక్తి గీతాల నడుమ ఫణి విజయ శ్రీ నాట్యం తోను అందరి హృదయాలు దోచుకున్నారు.
ముఖ్యం గా చెప్పుకోవలసినది ఆర్కెస్ట్రా గురించి కిషోర్ డ్రమ్స్ తోను రాజేష్ రిథం పాడ్ తోను ఆదిత్య కీ బోర్డ్ తోను అద్భుతాలు చేసారు
అతిధులు గా విచ్చేసిన సిని ప్రముఖులు మురళి మోహన్ గారు బ్లేడ్ బాబ్జి డైరెక్టర్ దేవి ప్రసాద్ గారు, కమల్ కామ రాజు గారు , కృష్ణుడు గారు, విజయానంద్ గారు మరియుశ్రీకృష్ణ గారు తమ ప్రసంగాలలో ఆలాపన టీం భవిష్యత్తు బాగుండాలి అని ఆశీర్వదించారు
సహాయ ఫౌండేషన్ ఆద్వర్యమ్ లో జరిగిన హృదయ స్పందన విజయ వంతం అవడం ఆనంద దాయకం ఆ చిన్నారుల భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండాలని కోరుకుంటూ ....
సహాయా
http://picasaweb.google.co.uk/sahaayafoundation412/HrudayaSpandanaGr8AchievementOfSahaaya
ఆ తరువాత సహాయ కేవలం అనాధ శరణాలయాలే కాకుండా వ్రుద్దాశ్రమలకు కూడా సహాయ సహకారందించాలనే ఉద్దేశంతొ అనేక వ్రుద్దశ్రమాలకు సాయం అందించుట జరిగినది .బ్. హెచ్ ఈ యెల్ వద్ద గల శ్రి సాయి నాధ అనాధ సొసైటి లోని 8 మంది వ్రుద్దులకు వారి కనీస అవసరాలు మరియు జీవితం చివరి దశ లో వారికి కావాల్సిన ఆసరా మరియుప్రేమభిమనలు సహాయ ద్వార అందించుట జరుగుతుంది
ఆ జ్ఞాపకాలు
http://picasaweb.google.co.uk/sahaayafoundation412/SatyaSaiOldageHomeBHEL#
http://picasaweb.google.co.uk/sahaayafoundation412/SriSainadhaAnadhaSadanOldAgeHome#
అది మొదలు సహాయ తన కార్యక్రమాలను విస్తరింప చేయాలనే ఉద్దేశం తో హైదరాబాద్ మరియు వైజాగ్ లోని అనాధ శరణాలయాల ఆచూకి కోసం నిరంతరం కృషి చేసి మరుగున పడి ఏ సాయం నోచుకోని అనాధ శరణాలయాలు ,, ౩౦ మంది పిల్లలు ఒకే సబ్బు తో స్నానం చేసి కప్పుకోడానికి దుప్పట్లు కూడా లేని రెండు పూటలా భోజనం చేయలేని పిల్లలున్న పరిస్థితులలో ఉన్నా అనేక అనాధ శరణాలయాలను వెలుగు లోకి తెచ్చి అనేక కార్పోరేట్ కంపెనీస్ లోని ఉద్యోగుల మరియు విద్యార్ధుల సహాయ సహకారాలతోను ఎన్నో అనాధ శరణాలయాలకు దీర్ఘ కాలిక సాయాలు అందేలా చూడడం లో చాల వరకు సఫలం అయిందని చెప్పవచ్చు
అదే సహాయ అనబడే ఆర్కుట్ కమ్యూనిటీ సహాయ ఫౌండేషన్ అనే ఒక సంస్థ గా మారడానికి దోహదం చేసింది
ఆ మధుర జ్ఞాపకాలు
http://picasaweb.google.co.uk/sahaayafoundation412/YMCaVizag
http://picasaweb.google.co.uk/sahaayafoundation412/YMCaVizag
http://picasaweb.google.co.uk/sahaayafoundation412/CareAndLove
http://picasaweb.google.co.uk/sahaayafoundation412/RakhiCelebrationsInHCHW#
http://picasaweb.google.co.uk/sahaayafoundation412/Adharana#
http://picasaweb.google.co.uk/sahaayafoundation412/RajuBdayCelebrations
అక్షయ్ ఆకృతి బదిరుల పాఠశాల నందు విద్యార్ధుల కనీస అవసరాలు వారు మెరుగైన విద్యాభ్యాసం కొనసాగించడానికి కావాల్సిన పరికరాల వివరాలు తెలుసుకొని వారికీ సాయ పడి వారి తో భోజనం చేసి వారి మనసుకి ఆహ్లాదం కలగా చేయడం జరిగింది సహాయ రెండవ కార్యక్రమం చాల ఉల్లాసం గ ఉత్సాహం గా జరిగింది పాల్గొన్న ప్రతి ఒక్కరు చాల సంతోషాన్ని వ్యక్తం చేసారు
సమాజం లో అన్ని ఉండీ అందరు ఉండి జీవితం లో పైకి రావడానికి స్థిరపడడానికి ఇన్ని సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం అలాంటిది ఎవరు లేని అనాధలు ఇంకెంత బాద పడతారు అసలు వారి మానసిక పరిస్థితి ఏంటి మొదలైన ఆలోచనల ఫలితం గా సహాయ ఫౌండేషన్ --- సహాయ అనే ఆర్కుట్ కమ్యూనిటీ గా 2007 జూలై న కొంత మంది యువతి యువకుల సహాయ సహకారాలతో శ్రీనివాస్ సారద్యం లో స్థాపించబడినది..
కేవలం అనాధ బాల బాలికలకు మెరుగైన విద్య వైద్యం మొదలగునవి అంద జేయలనేది సహాయ ముఖ్య ఉద్దేశం
సహాయ ప్రస్తానం ఎలా సాగిందో తరువాత ప్రచురణ ల లో చూద్దాం
bank account details
Name : SAHAAYA FOUNDATION
Acc. No : 293010100134613
AXIS BANK , ONGOLE BRANCH
< <నవీకరించినది శ్రీనివాస్